అన్నమయ్య: సుండుపల్లె పరిధిలోని మడితాడు, ముడుంపాడు గ్రామాల్లో అమ్మవార్ల తిరునాళ్ల ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయ. బహుదా నది ఉత్తరాన ఉన్న చిన్నక్కమ్మ, పెద్దక్కమ్మల ఆలయాన్ని తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆదివారం అమ్మవార్లకు కలశ పూజలు చేసి, నగిరి భోణం సమర్పించారు. నేడు రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాందిని బండ్ల ప్రదక్షిణలు, భక్తుల బోనాలు ఉంటుందన్నారు.