WGL: టీపీసీసీ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ముస్త్యాలపల్లికి చెందిన భాగాది రమేష్ నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రమేష్ తెలిపారు.