MBNR: గండీడ్ మండలం వెన్నాచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల తుది గడువు నేడే ముగియనుంది. ఇంకా అప్లై చేయని విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా సూచించారు. ఇందులో ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మే 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.