WG: ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో ఉంటూ, ఏదైనా పని చేసుకుంటూ జీవించాలని ఆకివీడు రూరల్ సీఐ కాళీచరణ్ హెచ్చరించారు. కాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్ల, ఉండి, ఆకివీడు మండలాల రౌడీషీటర్లకు ఆదివారం ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. ఎవరైనా తప్పులు, గొడవలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని సూచించారు.