ELR: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎంపీ పురందీశ్వరి ఆదివారం జలవనరుల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పూర్తికావాల్సిన నిర్మాణాలపై అధికారుల నుంచి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, సాంకేతిక అంశాలపై చర్చించారు.