కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామానికి చెందిన సరిదే భాను (73) వడగాల్పుల కారణంగా ఆదివారం మృతి చెందారు. గత 15 ఏళ్లుగా కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన శాలలో బల్లలు శుభ్రం చేస్తూ సేవలందించారు. స్వామివారి నిత్యాన్నదాన పథకానికి రూ.3 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేక ఆలయ సేవలతోనే జీవనం సాగిస్తుంది.