NDL: జిల్లాకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సుధాకర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 08514-222989 ఫోన్ నెంబర్ ద్వారా ఉదయం 8:30 గంటల నుంచి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.