NZB: సిరికొండ, మండలంలోని గడ్కోల్ గ్రామంలో అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెందిన ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ట్రాక్టర్లను సీజ్ చేయకుండా వారి వెంట తీసుకెళ్లి వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.