AP: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5 వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు ఉ.9:30 నుంచి మ.12:45 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందు చేరుకోవాలని విద్యాశాఖాధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు.