E.G: రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా రాజమండ్రి నియోజకవర్గానికి 6వ స్థానం దక్కిందని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం వెల్లడించారు. నిరంతరం ప్రజలతో మమేకం కావడంతోనే ఏపీలో తనకు ఈ గౌరవం దక్కిందన్నారు. భారీ నిధులు తెచ్చి రాజమండ్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. కూటమి శ్రేణుల సమన్వయంతో మరింత దూసుకుపోతామన్నారు.