KRNL: తుగ్గలి మండలం మారెల్లలో ఇళ్ల పక్కన ఉన్న మురుగు కాలువ విషయమై రెండు వర్గాలు గొడవకు దిగడంతో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎస్సై నరేష్ తెలిపారు. గ్రామానికి చెందిన చిన్న ఆంజనేయులు, సరళ పరస్పరం ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి అన్నారు.