కడప జిల్లాలో నేటి నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 4185 మంది విద్యార్థుల కోసం జిల్లాలో 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 190 మంది ఇన్విజిలేటర్లు, 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు.