PDPL: రామగుండం ఐటీఐ-ఏటీసీలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు నేటి నుంచి 25 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సురేందర్ తెలిపారు. సంప్రదాయ ఐటీఐ కోర్సులతో పాటు రోబోటిక్స్, సీఎన్సీ మెషినింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు.