CTR: మద్యం సేవించి వాహనాలు నడిపిన 5 మందికి చిత్తూరు కోర్టు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్య బాబు బుధవారం వెల్లడించారు. అధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ నిర్వహించగా.. మద్యం తాగి 5 మంది వాహనాలను నడుపుతూ పట్టుబడ్డట్టు ఆయన తెలిపారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ. 50 వేల జరిమానా విధించారన్నారు.