హీరో రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ‘ఠాగూర్’ సినిమాను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో వెల్లడించాడు. ‘తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ సినిమాను చూసి, దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావించాను. ఆ చిత్ర నిర్మాతతో మాట్లాడి రీమేక్ హక్కులు తీసుకుంటానని కూడా చెప్పాను. కానీ, వెంటనే అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాను’ అని రాజశేఖర్ పేర్కొన్నాడు.