ASR: అటవీశాఖ రాష్ట్ర ఉన్నతాధికారి పి.వి. చలపతిరావు అరకు పైనరిని సందర్శించారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మహిళా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పైనరిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. అరకు ప్రాంతాన్ని ఉన్నత ప్రమాణాలతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు.