MBNR: జడ్చర్ల మండలం కోడ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అనసూయ పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సభ నిర్వహించారు. సర్పంచ్ సాయి రెడ్డి ఆమె తొమ్మిదేళ్ల సేవలను కొనియాడుతూ ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఆమెను ఘనంగా సన్మానించారు.