KMM: మధిర మండలం సిద్ధినేనిగూడెం గ్రామ సొసైటీలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు బుధవారం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో ఒకే కేంద్రం ఉండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి, నూతన కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.