TG: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. కార్యాలయంలో కాలుజారి పడటంతో స్వల్ప గాయాలయ్యాయని, ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అభిమానంతో త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి వస్తానని ఆయన వెల్లడించారు.