WGL: నర్సంపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం చలివేంద్రాలు ప్రారంభమయ్యాయి. జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయగా.. ఛైర్మన్ డా.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఎండాకాలంలో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో బాటసారులు, సాధారణ ప్రజలకు త్రాగు నీటికి ఇబ్బంది కలగకుండా వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.