పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఒక మెట్టు ముందున్నాడని వ్యాఖ్యానించాడు. అతడిలో అద్భుతమైన ప్రతిభతో పాటు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం కూడా ఉందని కొనియాడాడు. కాగా, ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో ఈ యువ ఆటగాడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.