PDPL: ధర్మారంలోని అయ్యప్ప స్వామి ఆలయం & గోశాలలో ఇవాళ గోపూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్ ఆధ్వర్యంలో భక్తులు గోమాతను పసుపు కుంకుమ, పూలతో అలంకరించారు. పూజారి నర్సింగరావు మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు గోమూత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి హిందువు గోమాతను పూజించాలని ఈశ్వర్ సూచించారు.