NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రి యాగశాలలో చండీ హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి ఆలయ బోర్డు సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.