NRML: ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను నిర్మల్ జిల్లా పోలీసులు రికవరీ చేసి నేడు రూ.12 లక్షల విలువ గల ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఇప్పటివరకు మొత్తం 2135 ఫోన్లు బాధితులకు అందించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోయిన ఫోన్లను CEIR పోర్టల్లో నమోదు చేస్తే తిరిగి పొందవచ్చని వారు సూచించారు.