ఏలూరు రైల్వే స్టేషన్లో ఇవాళ ఈగల్ టీం పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఒడిస్సా రాష్ట్రం నుంచి వచ్చే రైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచిన అధికారులు, అనుమానాస్పద వ్యక్తులను వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు, విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. వాటిని రవాణా చేస్తే చర్యలు తప్పవన్నారు.