AP: గుంటూరు మోతీలాల్నగర్లో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రైల్వే స్థలాల్లో ఆక్రమణలను తొలగిస్తుండటంతో భారీగా పోలీసులను మోహరించారు. అయితే సీపీఐ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఇళ్ల తొలగింపును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైల్వే అధికారులతో CPI కార్యకర్తలు వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.