MBNR: నవాబ్‌పేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.