TG: ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. అందరి ఆమోదంతోనే తెలంగాణ ఏర్పాటైందని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతల వ్యాఖ్యలు సరిగాలేవని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు కలతకు గురిచేశాయని పేర్కొన్నారు.