KNR: జమ్మికుంట మండలంలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీని నేడు హుజూరాబాద్ సిటీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ నల్ల వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి లబ్దిదారులతో పాటు మండలంలోని సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొననున్నారు.