MNCL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపితే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని తెలిపారు.