NZB: ఆర్మూర్ పట్టణంలోని బాజన్న గైని వద్ద మున్నూరుకాపు సంఘం వెల్కమ్ కమాన్ నిర్మాణానికి మున్సిపల్ ఛైర్పర్సన్ గొనె లహరి భూమి పూజ చేశారు. ఆకుల రాజు, రాకేష్ ఈ కమాన్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా దాతలను సంఘ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.