టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘రానా, నేను పెళ్లి చేసుకోవాలకున్న కొత్తలో ఆయన నాకు ఒక యోడా బొమ్మను గిఫ్ట్‌గా ఇచ్చారు. తన దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయని, తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి రెండోది ఇద్దామని దాచుకున్నానని చెప్పాడు. ఆ బొమ్మే నా దగ్గర ఉన్న అన్నిటికంటే చాలా విలువైనది’ అని తెలిపింది.