KMM: మధిర మండలం ఖాజిపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. సాంబయ్య తెలిపారు. మే 13న జరిగే పరీక్షను దృష్టిలో ఉంచుకుని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ శిక్షణ ఉపయోగకరమని, ఏప్రిల్ 21 నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.