IPL మ్యాచ్ టికెట్లపై విధిస్తున్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫ్రాంచైజీలు విజ్ఞప్తి చేశాయి. IPL మ్యాచ్లను వినోదాత్మకంగా కాకుండా కేవలం ఒక క్రీడగానే పరిగణించాలని తెలిపాయి. ప్రస్తుతం మ్యాచ్ టికెట్లపై 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. తొలుత మ్యాచ్ టికెట్లపై 28 శాతం పన్ను ఉండగా, గతేడాది సెప్టెంబరులో దీన్ని పెంచారు.