WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి ఆలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు ప్రాతఃకాల విశేష దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.