KKD: ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతులలో అత్యధిక మార్కులు సాధించిన పీ.ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అత్యంత శ్రద్ధగా చదివి సాధించిన ఈ విజయం కేవలం వారికే కాకుండా, కాలేజ్‌కు, తల్లిదండ్రులకు మరియు సమాజానికి గర్వకారణమని పెర్కొన్నారు.