PPM: ఇష్టపడి చదివితే ఎంతటి ఫలితాలనయినా సాధించొచ్చని సాయిఅమృత నిరూపించిందని, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ మీడియట్ ఫలితాల్లో పార్వతీపురం పట్టణానికి చెందిన బెలగాం సాయిఅమృత 1000 మార్కులకు 987 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఈ మేరకు సాయిఅమృతను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సన్మానం చేశారు.