AKP: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సమక్షంలో శనివారం నక్కపల్లి మండలం అమలాపురం గ్రామానికి చెందిన 60 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులే పార్టీలోకి చేరడం ఆనందంగా ఉందన్నారు.