ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCB అరుదైన మైలురాయిని చేరుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆ జట్టుకు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. దీనితో ఒకే స్టేడియంలో వంద మ్యాచ్‌లు ఆడిన తొలి IPL జట్టుగా RCB రికార్డు సృష్టించింది. ఈ స్టేడియంలో 48 మ్యాచ్‌ల్లో గెలిచి, 46 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 4 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.