KMR: గాంధారి మండల కేంద్రంలో 108,102 అంబులెన్స్‌లను, స్పెషల్ ఇన్ఛార్జ్ గజేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధర్, ఈఎంఈ తిరుపతి, ఈఎంటి కమలాకర్, పైలెట్ నరేష్ పాల్గొన్నారు.