AKP: నర్సీపట్నం టౌన్ సీఐ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో శనివారం రహదారి భద్రత పై ఆటో యూనియన్ సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్కూల్ పిల్లలను తీసుకువెళ్లే ఆటోలో పరిమితికి మించి తీసుకు వెళ్ళవద్దని, వాహనాలను వేగంగా నడపవద్దని సూచించారు.