PDPL: సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ శనివారం ధర్మారం మార్కెట్ యార్డులో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. ధర్మారంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, ఎస్టీ మినీ గురుకులాన్ని టెన్త్ క్లాస్ వరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రీడల అభివృద్ధికి మినీ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.