నిర్మల్ పట్టణంలోని నాయుడు వాడ బస్తీ ఆధ్వర్యంలో రాత్రి హిందూ సమ్మేళనం వైభవంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో చిన్నారుల కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.