AP: పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కుట్రలను తిప్పి కొట్టాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. లోక్సభలో బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి వచ్చిన అవకాశంగా అందరూ భావించాలని తెలిపారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకుని దేశంలో అసమానతలకు బీజం వేయాలని ప్రయత్నించారని విమర్శించారు.