SRPT: దేశంలో, రాష్ట్రంలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి అన్నారు. శనివారం మట్టంపల్లిలో జరిగిన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేందుకు చేసిన పోరాటంలో సంఘం పాత్ర కీలకమైందని గుర్తు చేశారు.