RR: ఔటర్ రింగ్ రోడ్ (ORR) చుట్టూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మార్గాల వద్ద ప్రత్యేక డిపోలు ఏర్పాటు చేసి చార్జింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. ఈ కేంద్రాల్లో వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలు, పార్కింగ్, ప్రాథమిక సేవలు అందుబాటులో ఉంచి ప్రయాణికులకు సౌకర్యం కల్పించనున్నారు.