ADB: మావల మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల వసతి గృహాన్ని ఆదిలాబాద్ రెవెన్యూ అదనపు కలెక్టర్ చిత్రు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహం చుట్టుపక్కల పరిసరాలు, వంటగదిని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు.