MNCL: అటవీ చట్టాలు సమాజానికి, ప్రజలకు మేలు చేస్తాయని జన్నారం అటవీశాఖ FDO రామ్మోహన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అడవులను, వన్యప్రాణులను కాపాడడమే అటవీ చట్టాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అడవులు ఉన్నచోట విస్తారంగా వర్షాలు పడి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అడవులు ఉన్న చోట వాతావరణ కాలుష్యం తక్కువగా ఉండి ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వివరించారు.