NLR: రోడ్డుపై అడ్డుగా నిలిపిన బైక్‌ను పక్కకు తీయమన్నందుకు లారీ డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన శనివారం జరిగింది. కావలికి చెందిన ప్రభాకర్ పశువుల మేతను లారీలో తీసుకుని వెళ్తుండగా కసుమూరు రోడ్డులో బైక్ అడ్డంగా నిలిపి ఉండటాన్ని గమనించారు. దాన్ని పక్కకు తీయమని సూచించగా తిట్టి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదు చేశారు.