E.G: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని టింబర్ యార్డ్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.06 కోట్ల వ్యయంతో నిర్మించిన 1000 కిలో లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్‌ను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు.